పురుషాధిపత్యం కొనసాగుతున్న ఈ ప్రపంచంలో మహిళలు సమాన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. మహిళలు సైతం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే, ఆ దీవిలో మాత్రం పూర్తిగా మహిళలదే పైచేయి. ఆ దీవిలో ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తారు. పురుషులు చేయాల్సిన పనులను మహిళలే నిర్వహిస్తుంటారు. చివరకు పెళ్లిళ్లు, కర్మకాండలను కూడా మహిళలే నిర్వహిస్తారు. ఇది ఇప్పటి ఆచారం కాదు ఎన్నో వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం. అంతేకాదు, అక్కడ పురుషులు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ఇలాంటి ప్రాంతాలు కూడా ఉంటాయా అని అనుకోకండి. ఉన్నది.
Read: వైరల్: ట్రాక్టర్ ట్రాలీ ఊడి వెనక్కి వెళ్లింది… ఆ తరువాత…
యూరప్ ఖండంలోని ఎస్తోనియా దేశంలో దాదాపు 2000 లకు పైగా దీవులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి కిన్హూ దీవి. ఈ దీవిలో ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తుంటారు. ఇంటి పనుల నుంచి వ్యవసాయం వరకు అన్ని మహిళలే చూసుకుంటారు. పెద్ద వయసైన వృద్దులు, చిన్న పిల్లలు తప్పించి పురుషులు ఆ దీవిలో కనిపించరు. మరి పురుషులు ఏంచేస్తారు… ఎక్కడికి వెళ్తారు అంటే… పురుషులంతా చేపల వేటకు వెళ్తారు. సముద్రంలో నెలల తరబడి సముద్రంలో చేపలను వేటాడేందుకు వెళ్తారు. నెలల తరబడి అక్కడే ఉండిపోతారు. అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటారు. అందుకే పురుషులు చేయాల్సిన పనులను అన్నింటిని మహిళలే నిర్వహిస్తుంటారు.