కరోనా కారణంగా సినిమా థియేటర్లు చాలా కాలంగా మూతపడ్డాయి. సినిమా హాల్‌లో బొమ్మ పడి చాలా రోజులయింది. ఐతే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం.. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ఇప్పటికే కొన్ని సినిమా టయేటర్లు ఓపెన్ అయినా ఇంకా బొమ్మ పడలేదు.. అంతే కాదు సినిమాలు రిలీజ్ చేయడానికి ఏగ్జిబిటర్లు ముందుకు రాలేదు.. దీంతో థియేటర్లు ఎక్కువగా తెరుచుకోలేదు.
Read also : సెప్టెంబర్ 12న ‘మా’ ఎన్నికలు.. !
ప్రస్తుతం వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వడం.. పార్కింగ్ ఫీజుకు కూడా పర్మిషన్ ఇవ్వడంతో థియేటర్లు యాజమాన్యాలు తెరవడానికి ముందుకు వచ్చాయి. ఇక ప్రేక్షకులను అలరించడానికి నేటి నుంచి మళ్ళీ సినిమా హాళ్లలో బొమ్మ పడనుంది. సినిమా థియేటర్లలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ, కోవిడ్ నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటామని.. నిర్వాహకులు చెబుతున్నారు. ఇవాళ్టి నుంచి థియేటర్స్ వద్ద సినిమాల జాతర ఉండబోతుంది. గత ఏప్రిల్ నుంచి రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరిగా థియేటర్స్‌లో వకీల్ సాబ్ విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లు మూత పడడంతో సినిమాలన్ని వాయిదా పడ్డాయి. నేడు తేజ సజ్జ నటించిన ఇష్క్., సత్య దేవ్ నటించిన తిమ్మరుసు తో పాటు మరికొన్ని సినిమాలు వస్తున్నాయి.