తెలంగాణలోని జగిత్యాలలో దారుణం జరిగింది.. కన్న కొడుకునే కన్నా తండ్రిని అతి కిరాతకంగా కొట్టి చంపాడు.. వేరే వ్యక్తితో తన తల్లికి అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో నిత్యం వేధించేవాడు.. తల్లికి బాధను చూడలేకపోయినా కొడుకు తన స్నేహితులతో కలిసి కన్న తండ్రిని కడతేర్చాడు..
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెంలో దారుణం చోటు చేసుకుంది.. చిన్న మల్లయ్య అనే వ్యక్తి కుటుంబ పోషణ కోసం దుబాయ్ వెళ్ళాడు.. అక్కడ పని చేసుకుంటూ ఇంటికి డబ్బులు పంపించేవాడు.. ఇక తనకు ఒక కొడుకు, కూతురు ఉన్నట్లు తెలుస్తుంది.. కూతురు పెళ్లి కావడంతో తల్లీ కొడుకులు కలిసి ఉంటున్నారు.. అయితే చాలా ఏళ్లకు మల్లయ్య తిరిగి ఇండియాకు వచ్చాడు..
వచ్చినప్పటి నుంచి భార్యతో తరచూ గొడవపడేవాడు.. ఆయన వచ్చి మూడు నెలలు అవుతుంది.. కొడుకు ఎంత వాదించిన తండ్రి వినకుండా తల్లిని కొడుతూ హింసించేవాడు.. ఊర్లో పరువు పోతుందని రెండు నెలల క్రితం వల్లంపల్లి లో ఉంటున్న సోదరి ఇంటికి వెళ్ళిన తల్లి,కొడుకులు వెళ్లారు.. ఫోన్ చేసి గొడవ పడటంతో ఇంటికి వచ్చారు.. తాగి వచ్చి అనుమానం తో తల్లిని కొట్టాడు..ఇక నిన్న రాత్రి ఫోన్ లో గొడవ తండ్రి,కొడుకులు పెట్టుకున్నారు..అదే రాత్రి ఆవేశంతో స్నేహితులతో ఇంటికీ వచ్చి రోకలి బండ, కర్రలతో తలపై కొట్టి చంపాడు.. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.. పోలీసులకు సమాచారం అందటంతో మృతదేహన్ని పోస్ట్ మార్టం కు పంపించి కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు..