నేటి సమాజంలో ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది. అలాగే మోసాలు కూడా పెరిగిపోయాయి. చిన్న, మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ ఉండే ఆశ సొంతిల్లు. అయితే ఎంతో కష్టపడి డబ్బుదాచుకొని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని మరీ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఇల్లుకు సంబంధించిన డాక్యుమెంట్లు నకిలీవి అని తెలిస్తే వారి పరిస్థితి వర్ణనాతీతం. ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. మల్లంపేట్ సర్వే నంబర్ 170/3, 170/4,…