రూ.10 కోసం ఓ బాలుడిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌కు వచ్చిన బాలుడు రూ.10 ఇవ్వలేదన్న కారణంతో పూల్ యజమాని తండ్రీ కొడుకులు బాలుడి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత.. బాలుడి నోరు, ముక్కులో ఇసుక నింపారు. హత్య చేసిన అనంతరం సమీపంలోని చెరకు తోటలో పడేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.
తన మరదలు పై కన్నేసాడని తన మిత్రులతో కలిసి యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ బేగంపేటలోని పాటిగడ్డలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. పాటిగడ్డకు చెందిన ఉస్మాన్ అనే యువకుడు స్థానిక యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బావ అజజ్.. తన మరో ముగ్గురు మిత్రులతో కలిసి పాటిగడ్డలో ఉంటున్న అతని దగ్గరికి వెళ్లి రాత్రి సమయంలో యువకుడిని అడ్డగించారు. ఆ తర్వాత.. నలుగురు యువకులు కలిసి ఉస్మాన్ పై…