ఆఫ్ఘ‌న్‌పై ఆ మూడు దేశాల క‌న్ను… ఎందుకంటే…!!

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబ‌న్లు ప్ర‌పంచ గుర్తింపు కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  ఇప్ప‌టికే తాలిబ‌న్ల‌కు పాక్ ప్ర‌భుత్వం అండ‌గా నిలిచింది.  ప్ర‌భుత్వం ఏర్పాటులో ఆ దేశం కీల‌క పాత్ర పోషించిన‌ట్టు ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.  అయితే, దోహ ఒప్పందం ప్ర‌కారం స‌మీకృత ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలి.  కానీ, ఆఫ్ఘ‌నిస్తాన్ దానికి విరుద్ధంగా తాలిబ‌న్లు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.  ప్ర‌భుత్వంలో హమీద్ క‌ర్జాయ్‌, అబ్దుల్లా అబ్దుల్లా వంటి సీనియ‌ర్ నేత‌ల‌ను తీసుకోలేదు.  పైగా మ‌హిళ‌ల హ‌క్కుల‌ను ప‌క్క‌న‌పెట్టారు.  వారికి చ‌దువు నుంచి ఉద్యోగాల వ‌ర‌కు అన్నంటిని దూరం చేశారు. ఇది మ‌హిళ‌ల హ‌క్కుల‌ను హ‌రించిన‌ట్టే అవుతుంది.  దీంతో ప్ర‌పంచ దేశాలు తాలిబ‌న్ ప్ర‌భుత్వానికి గుర్తింపు ఇచ్చేందుకు వెన‌కాడుతున్నాయి.  అయితే, ప్ర‌స్తుతం పాక్‌తో పాటుగా, ర‌ష్యా, చైనా దేశాల రాయ‌బారులు తాలిబ‌న్ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.  తాలిబ‌న్లు స‌మీకృత ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేతందుకు ర‌ష్యా, చైనాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.  మ‌రోవైపు ఐరాస‌లో జ‌రుగుతున్న ప్ర‌పంచ‌దేశాల స‌ర్వ‌స‌భ్య స‌మావేశాల‌కు త‌మ‌ను కూడా ఆహ్వానించాల‌ని తాలిబ‌న్లు ఐరాస జ‌న‌రల్ సెక్ర‌టెరికీ లేఖ రాశారు.  

Read: అలా చేస్తే త‌ప్పేంటి? విద్యార్థి స‌మాధానానికి కేటీఆర్ ఫిదా…

-Advertisement-ఆఫ్ఘ‌న్‌పై ఆ మూడు దేశాల క‌న్ను... ఎందుకంటే...!!

Related Articles

Latest Articles