భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో తన కెప్టెన్సీ బాధ్యతలను నుండి తప్పుకోవాలనుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యపరిచింది అని బీసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. కోహ్లీ క్రికెట్ బోర్డు ఒత్తిడి కారణంగా కెప్టెన్సీ నుంచి తట్టుకోలేదని… అది తన సొంత నిర్ణయం అని స్పష్టం చేశాడు గంగూలీ. అయితే కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఉన్న కారణాలను తాను అర్ధం చేసుకున్నాను అన్నాడు. భారత జట్టును మూడు ఫార్మాట్లలో సుదీర్ఘకాలం నడిపించడం అంత సులభం కాదని.. గతంలో ఉన్న కెప్టెన్లు తనతో సహా అందరూ ఒకానొక సమయంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని చెప్పాడు.
అయితే విరాట్ కోహ్లీ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు… ఈ పొట్టి ఫార్మెట్లో ఒక బ్యాటర్ గా మాత్రమే కొనసాగుతానని చెప్పాడు. ఇక కెప్టెన్స్ నుండి తప్పుకోవడానికి కారణం ఒత్తిడి అని కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే భారత జట్టుకు మాత్రమే కాదు ఐపీఎల్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు కోహ్లీ.