రష్యా-ఉక్రెయిన్ మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య గత నాలుగేళ్ల నుంచి భీకర యుద్ధం సాగుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక శాంతి చర్చలు ప్రారంభించారు.
ఉక్రెయిన్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకునేలా అడుగులు వేస్తోంది రష్యా… ప్రధాన నగరాలను తమ ఆధీనంలోకి తీసుకునే పనిలోపడిపోయాయి రష్యా బలగాలు.. యుద్ధం వద్దంటూ అన్ని దేశాలు సూచిస్తున్నా.. రష్యా మాత్రం వెనక్కి తగ్గడంలేదు.. ఉక్రెయిన్ నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రతిఘటన ఎదురవుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి ఆరా తీయడంతో పాటు.. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటే మంచిదని సలహా ఇచ్చిన విషయం…
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అన్ని దేశాలను టెన్షన్ పెడుతున్నాయి.. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా.. ఆ దేశ రాజధాని వైపు దూసుకెళ్తుండగా.. మరోవైపు ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యా తగిన మూల్యం చెల్లించకతప్పదని అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది.. ఇక, ఉక్రెయిన్ నుంచి కొంత మంది భారతీయులను తరలించినా.. ఇంకా చాలా మంది ఉక్రెయిన్‌లో ఉంటున్నారు.. ఈ నేపథ్యంలో.. రంగంలోకి దిగారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయ పౌరుల భద్రత, క్షేమం కోసం…