Robert Vadra: ల్యాండ్ డీల్ కేసులో క్లీన్ చిట్.. నిజాయితీగా పనిచేశానన్న సోనియా అల్లుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ల్యాండ్ డీల్ కేసులో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబర్ట్ వాద్రా సంస్థ రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కు భూమిని బదలాయించడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి తెలిపింది. ఈ నేపత్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా భర్త సుదీర్ఘ ఫేస్‌బుక్ పోస్ట్‌లో సంతోషంగా ఉన్నానని అన్నారు. “నేను ఎప్పుడూ నిజాయితీగా పనిచేశాను,కష్టపడి అభివృద్ధి చెందాను. కానీ బిజెపి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తోంది. వారి ఏజెన్సీలు నా కంపెనీలపై దాడులు చేశాయి. వారు నన్ను రోజుల తరబడి ప్రశ్నించారు, 100ల నోటీసులు పంపారు, చట్టవిరుద్ధమైన పన్ను డిమాండ్‌లు చేశారు. నా ఆస్తులను అటాచ్ చేస్తారు. 20,000 డాక్యుమెంట్‌లకు పైగా తీసుకుంటారు. నేను పూర్తిగా సహకరిస్తూనే ఉన్నాను. నన్ను అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తూనే ఉన్నాను ”అని వాద్రా పోస్ట్‌లో తెలిపారు.
వ్యాపారాన్ని నిర్వహించడం, అన్ని పన్నులు చెల్లించడం వంటి చట్టబద్ధమైన పద్ధతులకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. తన వ్యాపార లావాదేవీల్లో ఎలాంటి తప్పుడు పనులు జరగలేదని హర్యానా ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఆశాకిరణం కనిపించడం ఆనందంగా ఉంది అని వాద్రా చెప్పారు. ఇది మరెవరికీ జరగదని నేను ఆశిస్తున్నానని, ప్రతీకార రాజకీయాల పద్ధతి దేశానికి విషపూరితం అని వాద్రా వ్యాఖ్యానించారు.
Also Read:Ice Cream Crime: ఐస్‘క్రైమ్’ స్టోరీ.. బాలుడు మృతి.. కేసులో షాకింగ్ నిజాలు
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
కాగా, వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ డిఎల్‌ఎఫ్‌కు భూమిని బదిలీ చేయడంలో ఎలాంటి నియమాలు లేదా నిబంధనలను ఉల్లంఘించలేదని హర్యానా ప్రభుత్వం బుధవారం పంజాబ్, హర్యానా హైకోర్టుకు తెలిపింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, వాద్రా మరికొందరిపై 2018 సెప్టెంబర్‌లో గురుగ్రామ్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో దర్యాప్తు ముడిపడి ఉంది. అయితే, ఈ డీల్ సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల రికార్డును హర్యానా పోలీసులు పరిశీలిస్తున్నారు. భూమి లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నుహ్ నివాసి సురీందర్ శర్మ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే, ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తాము ఎప్పుడూ తప్పు చేయలేదని మాజీ సీఎం హుడా, వాద్రా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్‌బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!