Gurugram: ఇండియాలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఢిల్లీ సమీపంలో 865 మిలియన్ డాలర్లతో చేపడుతున్న లగ్జరీ హోమ్స్ నిర్మాణం ప్రారంభం కాకముందే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ ప్రాంతంలో 1,113 విలాసవంతమైన నివాసాలను విక్రయించింది. డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్టులోని ఏడు టవర్లను నిర్మిస్తోంది. ఇందులో ఫోర్-బెడ్రూనం నివాసాలు, పెంట్ హౌజ్ యూనిట్లు అమ్ముడైనట్లు డెవలపర్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపారు.
ల్యాండ్ డీల్ కేసులో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబర్ట్ వాద్రా సంస్థ రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కు భూమిని బదలాయించడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి తెలిపింది.