12 Year Old Boy Died After Eating Ice Cream In Kerala: కేరళలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఓ బాలుడు.. చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. అహ్మద్ మరణంపై అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కుర్రాడి మృతి వెనుక మేనత్త హస్తం ఉందని తెలిసి.. పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రభంజనం.. ఒకే దెబ్బకు నాలుగు రికార్డులు
కేరళలోని కోళికోడ్ ప్రాంతంలో మహమ్మద్ అలీ కుటుంబం ఉంటోంది. ఆయన తన భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అతనికున్న కుమారుల్లో అహ్మద్ హసన్ రిఫాయి (12) ఒకడు. అతడు ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల అతని మేనత్త అయిన తాహిర (34) ఒక ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్‌ని వాళ్ల ఇంటికి పార్శిల్ పంపింది. ఆ సమయంలో ఇంట్లో కుర్రాడి తల్లి గానీ, ఇతరులు గానీ ఎవ్వరూ లేరు. అతనొక్కడే ఆ ఐస్ క్రీమ్ తిన్నాడు. అది తిన్న కాసేపటికే అహ్మద్‌కి వాంతులు రావడం మొదలయ్యాయి. దీంతో.. అతడ్ని వెంటనే ఇంటికి దగ్గరలో ఉన్న ఒక క్లినిక్‌గా తరలించారు. అప్పటికీ అతడు కోలుకోకపోవడంతో.. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. అప్పటికే విషం తీవ్ర ప్రభావం చూపడంతో, అహ్మద్ మృతి చెందాడు. అతని మృతిపై అనుమానం రావడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Extramarital Affair: ఆమె పాలిట శాపంగా మారిన వివాహేతర సంబంధం.. అసలేమైందంటే?
అహ్మద్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే ఐస్‌క్రీమ్ షాప్ వద్దకు వెళ్లారు. హెల్త్ డిపార్ట్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మంటె, ఫోరెన్సిక్ అధికారులు అక్కడ తనిఖీలు చేపట్టి.. ఆ షాప్‌ని మూసివేశారు. అయితే.. వాళ్లకు అనుమానాస్పదంగా ఏమీ లభించలేదు. ఇంతలో పోస్ట్-మార్టెమ్ రిపోర్ట్ రాగా.. ఐస్ క్రీమ్‌లో అమ్మోనియం ఫాస్ఫరస్ విషం కలిపినట్టు వెల్లడైంది. అప్పుడు కొందరి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. చివరికి ఆ కుర్రాడి మేనత్తే ఈ కుట్ర పన్నిందని పసిగట్టారు. దాంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. ఆమె ఈ పనికి ఎందుకు పాల్పడింది? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటన కేరళలో తీవ్ర కలకలం రేపుతోంది.