నేపాలీ బాలికను దత్తత తీసుకున్న నిర్మాత బండ్ల గణేష్.. నెటిజన్ల ప్రశంసలు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఓ పేద కుటుంబానికి చెందిన నేపాలీ బాలికను దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ స్వయంగా వెల్లడించాడు. కనీసం పాపకు సరైన పోషకాహారం కూడా ఇవ్వలేని స్థితిలో ఓ కుటుంబం ఉందన్న విషయం తెలుసుకుని… ఆ పాపను తాను దత్తత తీసుకున్నానని బండ్ల గణేష్ ప్రకటించాడు.

Read Also: ఏపీ గవర్నమెంట్ పై నవదీప్ ‘టమాట’ సెటైర్

సదరు పాప ఏడుస్తుంటే ఎవరూ పట్టించుకోకపోవడాన్ని తన భార్య చూసిందని..తన భార్య సూచన మేరకు పాపను దత్తత తీసుకున్నట్లు బండ్ల గణేష్ వివరించాడు. ఇప్పుడు ఆ పాప తన ఇంట్లో ఓ మెంబర్ అయిపోయిందని.. ఏకంగా ఆ పాప తమనే బెదిరిస్తుందని సరదాగా చెప్పాడు. అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకుని వాటికి చాలా డబ్బులు ఖర్చుపెడుతుంటారని.. తాను మాత్రం ఈ పాపను పెంచుకుని మంచిగా చదవించి వృద్ధిలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నానని బండ్ల గణేష్ తెలిపాడు. కాగా బండ్ల గణేష్ చేసిన మంచి పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బండ్ల గణేష్ మంచి మనసు చాటుకున్నాడని పలువురు కొనియాడుతున్నారు.

Related Articles

Latest Articles