ఫేస్‌బుక్‌పై గత కొన్ని రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ పేరును మార్చుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఫేస్‌బుక్ కొత్త పేరుపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఫేస్‌బుక్ త్వరలోనే మోటావర్స్‌ను రిలీజ్ చేయబోతున్నదని, మోటా అనే పేరుతో కొత్తగా లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ మాజీ సివిక్ చీఫ్ తెలిపారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొంతమంది వ్యక్తుల కోసమే పనిచేస్తుందని, వీఐపీల ప్రైవసీల విషయంలో వారిని అందలం ఎక్కిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో యూజర్ల భద్రతే తమకు ముఖ్యమని తెలియజేసేందుకు ఫేస్‌బుక్ పేరును మార్చుకోబోతున్నదని నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 28 వ తేదీలోగా ఫేస్‌బుక్ తన పేరును మార్చే అవకాశం ఉంది.