వ‌చ్చే ఏడాది నుంచి భార‌త్‌లో బూస్ట‌ర్ డోసు…

భార‌త్‌లో టీకా కార్య‌క్ర‌మం వేగంగా సాగుతున్న‌ది.  ఇప్ప‌టికే 100 కోట్ల డోసుల వ్యాక్సినేష‌న్ జ‌రిగింది.  త్వ‌ర‌లోనే దేశంలో అర్హులైన అంద‌రికీ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది భార‌త ప్ర‌భుత్వం.  అయితే, చిన్నారుల‌కు సంబంధించి వ్యాక్సినేష‌న్ కూడా త్వ‌ర‌లోనే అందుబాటులోకి రాబోతున్న‌ది.  కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను త‌యారు చేసిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా వ్యాక్సినేష‌న్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  రానున్న రోజుల్లో మ‌రింత వేగంగా డోసుల కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.  వ‌చ్చే ఏడాది మొద‌టి నెల‌లోనే బూస్ట‌ర్ డోసును అందుబాటులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు.  ఆఫ్రికా దేశాల‌కు ముందుగా రెండు డోసుల టీకాలు అందాల‌ని, ఆఫ్రికా ఖండం మొత్తం మీద క‌నీసం మూడు శాతం మందికి కూడా టీకాలు అంద‌లేద‌ని పూనావాలా తెలిపారు.  ప్ర‌మాదం పొంచిఉన్న వారికి, వృద్ధుల‌కు బూస్ట‌ర్ డోసుల‌కు అందుబాటులో ఉంచుతామ‌ని, ప్ర‌పంచంలో అంద‌రికి రెండు డోసుల వ్యాక్సిన్లు అందే వ‌ర‌కు మిగ‌తా వారు బూస్ట‌ర్ డోసుల కోసం వేచి ఉండాల‌ని అన్నారు.  

Read: ఈ రాష్ట్రాల్లో ఫ‌స్ట్ డోస్ పూర్తి…

Related Articles

Latest Articles