వడ్డీ రేట్లపై ప్రకటన చేశారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు.. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్ రెపో రేటు 3.5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం 5.7 శాతం పరిధిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఆర్బీఐ రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద ఉంచుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.. జూన్‌లో ద్రవ్య విధాన కమిటీ అంచనాల ప్రకారం ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయి.. ఇక, కరోనా సెకండ్ వేవ్ ఎదురుదెబ్బ నుండి కూడా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని తెలిపారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.