ఒమిక్రాన్ పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన… ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కు ధరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది అని మోదీ అన్నారు. దేశంలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఐసోలేషన్ బెడ్లు, 5 లక్షల ఆక్సిజన్ బెడ్లు రెడీగా ఉన్నాయని చెప్పారు. కోటి 40 లక్షల ఐసీయూ బెడ్లు ఉన్నాయన్నారు. పిల్లల కోసం కూడా 90వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
దేశంలో ఈ ఏడాది జనవరి 26న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైందని.. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్‌లో భారత్ ముందుందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో 141 కోట్ల కరోనా టీకా డోసులు పూర్తయ్యాయన్నారు. కరోనాపై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక ఆయుధం అని అన్నారు. అనేక రాష్ట్రాల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యిందన్నారు. వైద్య సిబ్బంది కఠోర శ్రమ వల్లే వందశాతం వ్యాక్సినేషన్ సాధ్యమైందని మోదీ అభిప్రాయపడ్డారు. పాఠశాలకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వల్ల తల్లిదండ్రులకు భరోసా వస్తుందన్నారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!