అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజధాని అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. మంగళగిరిలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా దీక్షకు దిగిన పవన్‌ను అమరావతి ప్రాంత మహిళా రైతులు కలిశారు. తొలి నుంచి అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉన్న పవన్‌కు కృతజ్ఞతలు చెప్పిన వారు.. ముగింపు సభకు రావాలని ఆహ్వానించారు. తమ ఆహ్వానం పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు అమరావతి ప్రాంత మహిళా రైతులు వెల్లడించారు. అయితే తిరుపతిలో అమరావతి రైతులు పాదయాత్ర ముగింపు సభ నిర్వహించాలని తలపెట్టగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ సభ అనుమతి కోసం తాము హైకోర్టును ఆశ్రయిస్తామని రైతులు స్పష్టం చేశారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని రాజధాని పరిరక్షణ సమితి ప్రతినిధులు, మహిళా రైతులు కలిశారు. రాష్ట్రానికి ఒకే రాజధాని అని భరోసా ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల మహా పాదయాత్ర, తమ ఇబ్బందులను తెలిపారు.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
Video Link: https://t.co/iy8WVDZiQY pic.twitter.com/5QDbYgPpws
— JanaSena Party (@JanaSenaParty) December 12, 2021
మరోవైపు అమరావతి రైతుల పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. వారి పాదయాత్ర 42వ రోజుకు చేరింది. ఎన్ని కష్టాలు ఎదురైనా అమరావతి రైతులు పాదయాత్రను చేస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా కృష్ణా జిల్లా గన్నవరం నుంచి మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లే మార్గం అధ్వాన్నంగా తయారైంది. ఈ నేపథ్యంలో ఈరోజు వడ్డేశ్వరంలో ఆగి పవన్ కళ్యాణ్ శ్రమదానం నిర్వహించారు. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేపట్టారు.
తాజావార్తలు
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!