Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
- మహారాష్ట్ర ఎయిర్‌హోస్టెస్ హత్యను ఛేదించిన పోలీసులు..
- తన భర్తతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ప్లాన్ చేసిన భార్య..
- కాంట్రాక్ట్ కిల్లర్స్‌తో హత్య చేయించిన మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర గోండియా జిల్లాలో ఓ ఎయిర్‌లైన్ ఉద్యోగిని హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భర్తతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్యనే, సదరు మహిళా ఉద్యోగిని హత్య చేయించినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలితో సహా నలుగురుని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలిని వర్షా తుర్కర్ (35)గా గుర్తించారు. ఆమె మృతదేహం నవంబర్ 14న ఓ అటవీ ప్రాంతంలో కనిపించింది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన సమయంలో కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
దీపావళి సెలవులకు వెళ్లి..
పూణె జిల్లాలోని ధనోరీకి చెందిన బాధితురాలు వర్ష తుర్కర్ దీపావళి సెలవుల సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని కిన్హి గ్రామంలోని తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. నవంబర్ 14న తన స్నేహితుడు నితేష్ అగర్వా్ల్తో కలిసి మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని తిరోడాకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో దావానివాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని బోండ్రానీ గ్రామ అటవీ ప్రాంతంలో ఉన్న శివాలయం సమీపంలో వీరిద్దరూ ఆగారు. సాయంత్రం 6 గంటల మధ్య ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో వర్షాపై దాడి చేశారు. ఆమె పొట్ట, వీపుపై పలుమార్లు కత్తితో దాడి చేయడంతో వర్షా అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Also Read
- Drug Racket: DRI మెరుపు దాడులు.. రూ.700 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..
- Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!
- ACB Raids: ఏసీబీ వలలో మహబూబాబాద్ జిల్లా సర్పంచ్.. ఏకంగా రూ.30 లక్షలకు బేరం..
- స్నాప్‌చాట్ కేంద్రంగా హైటెక్ డ్రగ్స్ దందా గుట్టురట్టు.. క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు!
భార్యనే పక్కా ప్లాన్‌తో హత్య చేయించింది.
విచారణలో నితేష్ అగర్వాల్ భార్య మోనా అగర్వాల్(41) తన భర్తకు వర్షా తుర్కర్తో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. తన నివాసానికి సమీపంలో ఉండే కునాల్ కుంభాల్కర్తో ఆమె హత్యకు ప్రణాళిక రూపొందించింది. కుంభాల్కర్ నేరస్తుడైన షారూఖ్ పఠాన్‌తో వర్షా హత్యకు రూ. 13 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత షారూఖ్ పఠాన్ ఈ హత్య కోసం ఇమ్రాన్ షేక్ (26), నలేన్ అలియాస్ నైలాన్ షేక్ (24), క్రిష్ రౌత్ (19)లను పంపించాడు.
సీసీటీవీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్‌తో చిక్కిన నిందితులు..
కేసును ఛేదించేందుకు పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల పాటు తిరోడా, ఖైర్లాంజీ, వారాసియోని, బాలాఘాట్, గోండియా ప్రాంతాలను కలిపే మార్గాల్లో దాదాపు 200 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ ఫుటేజీల్లో నితేష్ అగర్వాల్ నడుపుతున్న కారును ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెంబడించినట్లు గుర్తించారు. సీసీఫుటేజీ, సాంకేతిక విశ్లేషన, నిఘా వర్గాల సమాచారంతో నిందితుల్లో ఒకరైన ఇమ్రాన్ కరీం షేక్‌ను గుర్తించారు. నవంబర్ 19న గోండియా జిల్లాలోని మూర్తి గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
వర్షాను కలిసేందుకు నితేష్ అగర్వాల్ బాలాఘాట్‌కు వెళ్లిన సమయంలో నిందితులు అతడి కదలికల్ని గమనించినట్లు పోలీసులు వెల్లడించారు. నితేష్ ఉపయోగిస్తున్న కారు అతడి భార్య మోనా పేరుతో రిజిస్టరై ఉంది. అందులో జీపీఎస్ ట్రాకింగ్ సదుపాయం ఉంది. కారు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుని నిందితులు బైక్‌తో వెంబడించారు. ప్రస్తుతం మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
-
Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
-
Asteroids: భూమి వైపు దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు.. నాసా 48 గంటల పాటు అలర్ట్!
-
Kerala High Court: ‘దత్తత’ అనే పదం తొలగించండి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!