ఆమెరికాపై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ నిందలు వేస్తున్నదని ఆరోపించారు. 2001లో అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్‌పై దాడులు చేసిన సమయంలో పాకిస్తాన్‌లో రాజకీయ సుస్థిరత లేదని, జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేసి పాలన చేజిక్కించుకున్నారని, ముషారఫ్‌కు అమెరికా మద్ధతు అవసరమవడంతో ఆఫ్ఘన్‌లో యుద్ధానికి మద్ధతు పలికారని, ఇది తప్పుడు నిర్ణయం అని పాక్ పీఎం పేర్కొన్నారు. అయితే, విదేశీదళాలకు వ్యతిరేకంగా వారికి శిక్షణ ఇచ్చామని, అమెరికాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఉగ్రవాదులు అంటారని, అందుకే ముజాహిదీన్లు తమకు వ్యతిరేకమయ్యారని పాక్ పీఎం పేర్కొన్నారు. అమెరికాకు అప్పట్లో మద్ధతు పలికి తప్పుచేసినట్టు పాక్ పీఎం పేర్కొన్నారు. అమెరికాపై పాక్ ఈ విధమైన కామెంట్లు చేయడం ఇదే మొదటిసారి.
Read: పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని ఆమె ఎందుకు తిరస్కరించింది?