పంజాబ్ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఆమె ఎందుకు తిర‌స్క‌రించింది?

పంజాబ్ రాజ‌కీయాలు రంగులు మారుతున్నాయి.  అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా త‌రువాత ముఖ్య‌మంత్రి ఎంపిక బాధ్య‌త‌ల‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అప్ప‌గించారు.  కాగా, కాంగ్రెస్ పార్టీ పంజాబ్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని ఆ పార్టీ సీనియర్ నేత అంబికా సోనీకి అధిష్టానం నుంచి పిలుపు వ‌చ్చింది.  అయితే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫ‌ర్‌ను అంబికాసోనీ తిర‌స్క‌రించారు.  పంజాబ్ ముఖ్య‌మంత్రిగా సిక్కు వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని నియ‌మిస్తేనే బాగుంటుందని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిక్కు వ‌ర్గంనుంచి వ్య‌తిరేక‌త రాకుండా ఉండాలి అంటే ఆ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికే ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించాల‌ని రాహుల్ గాంధీని కోరిన‌ట్టు అంబికాసోనీ తెలిపారు.  

Read: చంద్రబాబుకు షాక్ : నారావారిపల్లెలో వైసీపీ గెలుపు

Related Articles

Latest Articles