మేషం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. స్కీంలు, వాయిదాల పద్ధతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. స్త్రీలపై పొరుగువారి ప్రభావం అధికంగా ఉంటుంది.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని చిన్నతరహా పరిశ్రమల్లో వారికి విద్యుత్ లోపం వల్ల దుబారా పెరగడంతో అశాంతి అధికం అవుతుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు జాగ్రత్త అవసరం. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చకండి.
మిథునం : ఈ రోజు ఈ రాశివారు తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
కర్కాటకం : ఈ రోజు మీరు ఒక్కోసారి అతి మొండివైఖరి అవలంభించడం వల్ల అపవాదులు ఎదుర్కొంటారు. జాగ్రత్త అవసరం.. ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. సహకార సంఘాల్లో వారికి ప్రైవేటు సంస్థల్లో వారికి ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు.
సింహం : ఈ రోజు మీరు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. తలపెట్టిన పనులు అర్థాంతరంగా ముగిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఫ్యాన్సీ వ్యాపారస్తులకు పురోభిృద్ధి కానవస్తుంది. మీ శక్తి సామర్థ్యాలపై విశ్వాసం సన్నగిల్లుతుంది.
కన్య : ఈ రోజు ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నాలు ముందుకు సాగవు.. కొంతమంది మిమ్మల్న నిరుత్సాహ పరచడానికి ప్రయత్నిస్తారు. ఉమ్మడి ఆస్తి విక్రయాల్లో సోదరుల నుంచి అభ్యంతరాలెదుర్కొంటారు.
తుల : ఈ రోజు ఈరాశిలోని ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి పురోవృద్ధి కానవస్తుంది. విద్యార్థులు విదేశాల్లో పై చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వృత్తులు, కార్మికులు, నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనివారికి పనిభారం అధికమవుతుంది. మీ సంతానం పై చదువుల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. మీ సమస్యలను ఆత్మీయులకు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పాత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
ధనస్సు : ఈ రోజు ఆర్థిక విషయాల్లో కొంత మేరకు పురోగతి సాధిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయలు చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నూతన వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు.
మకరం : ఈ రోజు మీకు ఆర్థిక లావాదేవీలు బాగా కలిసివస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. అపార్థాలు మాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. రాజకీయ రంగంలో వారికి ఆరోగ్యం లోపం. అధిక శ్రమ ఉంటాయి.
కుంభం : ఈ రోజు మీరు దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.
మీనం : ఈ రోజు మీరు లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. నూతన పరిచయాలేర్పడతాయి అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఎదుటివారు చెప్పేది జాగ్రత్త విని మీ ఆలోచనలను తగిన విధంగా మలుచుకోండి. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.