టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరికీ మంచి స్థానం ఉంది. అలాగే అభిమానులు కూడా ఇద్దరికీ భారీగానే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్స్ రేసులో ఉన్నారు. తారక్, అల్లు అర్జున్ ఇద్దరూ డ్యాన్స్ లోనూ నటనలోనూ ఎవరికి వారే ప్రత్యేకం. అయితే తాజాగా వీరిద్దరి అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. ఎక్కడ మొదలైందో, ఎలా మొదలైందో తెలీదు కానీ… మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ దారుణంగా ట్రోలింగ్ కు పాల్పడుతున్నారు అభిమానులు. ప్రస్తుతం ట్విట్టర్ లో #InsecureFoxAlluArjun, #CharacterlessPigNTR అనే హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి.
Also Read : నయన్ తో ఫేవరెట్ పిక్… షేర్ చేసిన ప్రియుడు…!
తారక్ నిర్మాతలను బ్లాక్ మెయిల్ చేస్తాడని, అతనితో సినిమాలు చేయమని బలవంతం చేస్తాడని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఎన్టీఆర్ అభిమానులేం తక్కువ తినలేదు… వారు కూడా రంగంలోకి దిగి ‘ఇన్ సెక్యూర్ ఫాక్స్’ అంటూ అల్లు అర్జున్ పై సెటైర్లు వేస్తున్నారు. అయితే స్టార్ హీరోలంతా ఒకరితో ఒకరు మంచి స్నేహబంధం కలిగి ఉంటారు. కానీ అభిమానులు మాత్రం ఇలా కొట్టుకు చస్తుంటారు. కనీసం ఇంగితజ్ఞానం అనేది లేకుండా ఇలా వాళ్లకు నచ్చని హీరోకు విరుద్ధంగా చెత్త హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ చేస్తారు. ఇలాంటి అసహ్యకరమైన పనులు చేసి వారి అభిమానులమని చెప్పుకుంటూ హీరోల పరువు తీస్తుంటారు. తారక్, బన్నీ ఫ్యాన్స్ మధ్య ఈ అగ్లీ ఫైట్ కు కారణమేంటో తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్’ అనే ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రంలో కొమురం భీమ్ గా కన్పించనున్న విషయం తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ “పుష్ప” అనే భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు.