మా ఎన్నికలు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా ఎన్నికలు సినీ పరిశ్రమలో కాకరేపుతున్నాయి.. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. అయితే, తాజాగా మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు.. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్ అని.. ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవన్నారు.. ప్రకాశ్ రాజ్ తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలని సూచించిన ఆయన.. విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబుకు తెలుసు, నటీనటులకు ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రకాశ్ రాజ్ కే తెలుసని కామెంట్ చేశారు.
ఇక, నిర్మాతలతో వివాదం ప్రకాశ్ రాజ్ కే కాదు మోహన్ బాబు కుటుంబానికి కూడా ఉన్నాయని విమర్శించారు నాగబాబు.. సలీం చిత్రం విషయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరినే మోహన్ బాబు అదోగతి పట్టించారని ఆరోపించారు. మోహన్ బాబుకు ఎదురు తిరగలేక ఎంతో మంది వెనుతిరిగారని కామెంట్ చేసిన ఆయన.. మీ వివాదాల్లో తప్పెవరితో మాకు తెలియదు, ప్రకాశ్ రాజ్ వివాదాల్లో తప్పెవరితో మీకు తెలియదని వ్యాఖ్యానించారు. ఇక, విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ చదువుకున్నావు అని ప్రశ్నించారు నాగబాబు.. మంచు విష్ణు మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు అని కామెంట్ చేసిన మెగా బ్రదర్.. ప్రకాశ్ రాజ్, విష్ణు తెలుగు పరీక్ష రాస్తే విష్ణుకు పాస్ మార్కులు కూడా రావు అంటూ సంచలన విమర్శలు చేశారు. ప్రకాశ్ రాజ్ ని తెలుగోడంటారు, విష్ణును తెలుగు నేర్చుకొమ్మంటారని కామెంట్ చేసిన ఆయన.. సినిమా జ్ఞానం, ప్రపంచజ్ఞానం ఉన్న ప్రకాశ్ రాజ్ కే నా మద్దతు అంటూ మరోసారి స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!