సాయిధరమ్ తేజ్‌నే కాపాడింది అదే.. వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో సాయ్ ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం.. ఆస్పత్రికి తరలించడం కూడా వెనువెంటనే జరిగిపోయాయి.. ఆయనకు సరైన సమయంలో ట్రీట్మెంట్ అందడం వల్లే ప్రాణాపాయం తప్పింది అంటున్నారు తేజ్‌కు మొదట ట్రీట్మెంట్ చేసిన మెడికవర్ వైద్యుల బృందం… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మెడికవర్ వైద్యులు.. గోల్డెన్ హవర్లో ట్రోమా కేర్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అని.. ఈ టైంలో ఇచ్చే ట్రీట్మెంటే సాయి ధరమ్ తేజ్‌ని కాపాడుతోందన్నారు.. ప్రమాదం జరిగిన గంటలోపు వైద్యం అందించడం ద్వారా తేజ్‌ను కాపాడగలిగాం అన్న వైద్యులు.. 108 సిబ్బంది కూడా సమయానికి ఆయన్ని ఆస్పత్రికి తీసుకువచ్చారని తెలిపారు.
ఇక, మా ఆస్పత్రికి వచ్చేలోపు సాయిధరమ్ తేజ్ అపస్మారకస్థితిలో ఉన్నాడని తెలిపారు మెడికవర్ వైద్యులు.. అతనికి అప్పటికే ఫిట్స్ వచ్చినట్లుగా తెలిసిందని.. వెంటనే మరోసారి ఫిట్స్ రాకుండా ట్రీట్మెంట్ ఇచ్చామని వెల్లడించారు.. ప్రమాదంలో కిందపడటంతో షాక్‌కు గురికావడం ద్వారా ఫిట్స్ వస్తాయని తెలిపాన వైద్యులు.. బ్రెయిన్ కు ఏదైన ప్రమాదం జరిగినప్పుడు కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు.. అయితే, ఆ తర్వాత బ్రెయిన్, స్పైనల్ కార్డ్, షోల్డర్, చెస్ట్ అబ్డామిన్ స్కానింగ్‌లు చేశామని.. బ్రెయిన్, స్పైనల్ స్కానింగ్ రిపోర్టులు నార్మల్‌గా వచ్చాయని తెలిపారు. ఇక, భుజం దగ్గర ఉన్న కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయ్యిందని.. లక్కీగా ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కడా లేదని స్పష్టం చేశారు వైద్యులు.. చాతిపై గాయాలు ఉన్నాయని.. హెల్మెట్ పెట్టుకోవడంతో లక్కీగా అతని తలకు గాయాలు కాలేదన్నారు.. కాకపోతే శ్వాస తీసుకోవడానికి కొంత ఇబ్బంది పడ్డాడని.. దీంతో కృతిమ శ్వాస పెట్టాల్సి వచ్చిందని.. అపస్మారక స్థితిలో ఉన్నాడు కాబట్టి కృతిమ శ్వాస ఇవ్వాల్సి వచ్చిందనా క్లారిటీ ఇచ్చారు వైద్యులు. కాగా, తేజ్‌కు మెడికవర్‌లో చికిత్స అందుతుండగా.. ఆస్పత్రికి వచ్చిన పవన్ కల్యాణ్, ఇతర కుటుంబ సభ్యులు.. ఆ తర్వాత.. అపోలో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు తేజ్.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో వైద్యులు.. బులెటిన్‌లో పేర్కొన్న సంగతి విదితమే.
Also Read
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!