17 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా… ఇదే కారణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాములుగా ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే వామ్మో అనేస్తాం. అలాంటిది అడవిలో ఒంటరిగా ఉండాలంటే ఇంకేమైనా ఉన్నదా చెప్పండి. ఒకరోజో రెండు రోజులో అనుకుంటే సరేలే అనుకోవచ్చు. 17 ఏళ్లు ఒంటరిగా అడవిలో ఉండటం అంటే మాములు విషయం కాదు. 56 చంద్రశేఖర్ అనే వ్యక్తి కర్ణాటకలోని మంగళూరు అడవుల్లో గత 17 ఏళ్లుగా ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఒంటరిగా సుల్యాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరంతోడ్ గ్రామం నుంచి అద్దేల్ నెక్కారే అడవుల్లో ప్రయాణం చేస్తుంటే ఆ అడవిలో చిన్న మార్గం పక్కన ప్లాస్టిక్ కవర్ కప్పిన గుడిసే కనిపిస్తుంది. అందులో ఒకప్పటి ప్రీమియం పద్మినీ కారు ఉంటుంది. అ గుడిసెలో కారులో చంద్రశేఖర్ నివశిస్తున్నాడు. 17 ఏళ్ల క్రితం ఆయనకు నెక్రల్ కెమ్రాజీ అనే గ్రామంలో 1.5 ఎకరాల భూమి ఉన్నది. సాగు నిమిత్తం ఆయన స్థానిక సహకార బ్యాంకు నుంచి రూ.40 వేలు రుణం తీసుకున్నాడు. అయితే, కొన్ని కారణాల వలన ఆయన తన బాకీ తీర్చలేకపోయాడు. దీంతో అధికారులు ఆయన పొలాన్ని వేలం వేశారు. మనస్థాపం చెందిన చంద్రశేఖర్ వెంటనే తన కారును, సైకిల్‌ను తీసుకొని అడవిలోకి వచ్చేశారు. అడవిలోనే నివశిస్తున్నాడు. అడవిలో దొరికే కాయలు తింటూ, జలపాతాల వద్ధ స్నానం చేస్తూ జీవిస్తున్నాడు. ఆహారం కోసం బుట్టలు చేసి వాటిని సమీపంలోని గ్రామాల్లో అమ్మి వచ్చి డబ్బుతో కావాల్సిన నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసుకునేవాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆయన్ను కలిసి ఇల్లు కట్టిస్తానని చెప్పినా దానికి చంద్రశేఖర్ ఒప్పుకోలేదట. తనకు అడవి చాలని, అక్కడున్న జంతువులు తనను ఏమీ చేయవని అన్నారు. అటవీశాఖ అధికారులు కూడా చంద్రశేఖర్ వలన అడవికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు.
Read: లఖింపూర్ ఖేరీ ఘటన: క్రైమ్ బ్రాంచ్ ముందుకు కేంద్రమంత్రి కుమారుడు
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!