Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత
- సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా అరెస్ట్
- వీడియో పంచుకున్న అభిజీత్ దీప్కే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించిన మరుసటి రోజే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ నేతలు ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్ నేతృత్వంలో మంగళవారం ఉదయం జంతర్ మంతర్ దగ్గరకు చేరుకున్న కార్యకర్తలు.. ఇనుప గేటు, పోలీసుల బారికేడ్లు దాటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
సీన్లోకి వచ్చిన సీజేపీ కార్యకర్తలు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని గేటు దూకి జంతర్ మంతర్ ప్రాంతంలోకి ప్రవేశించిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. కార్యకర్తలు నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లారు. ‘భారత్ మాతా కీ జై’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ నినదించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తరలించారు.
Also Read
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా గుర్తించడాన్ని కేంద్రం రద్దు చేయడంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. ‘‘నిరసనను డీనోటిఫై చేయలేరు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినంత మాత్రాన ఆందోళనలు ఆగిపోవని వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని భయం ఈ నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తోంది. జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన స్థలంగా తొలగిస్తే ఆందోళనలు ఆగిపోతాయని భావిస్తున్నారు. కానీ అలా జరగదు. దేశవ్యాప్తంగా జంతర్ మంతర్లు వెలుస్తాయి’’ అని దీప్కే పేర్కొన్నారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సుల మేరకు ఢిల్లీలో నిరసనలు, ధర్నాల కోసం మూడు కొత్త ప్రదేశాలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. రాంలీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ మైదాన్‌ను ప్రతిపాదించాయి. అత్యంత భద్రత ఉండే మధ్య ఢిల్లీలోని జంతర్ మంతర్ ఇప్పటివరకు నిరసనలకు ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతంగా ఉండేది. తాజా నిర్ణయంతో ఇకపై నిరసనలకు అనుమతి ఉండదని నివేదికలు పేర్కొన్నాయి.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) వివాదం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి, సీజేపీ నిరసనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10 నుంచి ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనకారులను ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు. అక్టోబర్ 10న ఢిల్లీకి చేరుకున్న సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు.
Cockroaches with the Tiranga sneaked into Jantar Mantar early this morning before they were picked up by Delhi Police.
@AshutoshRanka, @SauravDassss, @AjinkyaCJP along with other team members have been detained.
You cannot denotify the resistance, @narendramodi https://t.co/x7B40akCVO
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 13, 2026
తాజావార్తలు
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!