ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌: క్రైమ్ బ్రాంచ్ ముందుకు కేంద్ర‌మంత్రి కుమారుడు

యూపీలోని ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌నకు కార‌ణ‌మైన కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు హాజ‌ర‌య్యారు.  సుప్రీం కోర్టు ఆదేశాల‌తో పోలీసులు ఆశిశ్ మిశ్రాకు నోటీసులు జారీ చేసింది.  దీంతో ఆయ‌న ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు హాజ‌ర‌య్యారు.  ప్ర‌స్తుతం పోలీసులు ఆశిశ్ మిశ్రాను విచార‌ణ చేస్తున్నారు.   ల‌ఖింపూర్‌లో కేంద్రం తీసుకొచ్చిన రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఈనెల 3  తేదీన నిర‌స‌న‌లు చేస్తున్నారు.  ఆ స‌మ‌యంలో కేంద్ర మంత్రి కుమారుడి కారు రైతుల‌పైకి దూసుకెళ్లింది.  ఆ ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు మృతి చెందారు.  అనంత‌రం జ‌రిగిన ఘ‌ట‌న‌లో మ‌రో ఐదుగురు మృతి చెందారు.  దీనిపై  పోలీసులు వెంట‌నే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకొక‌పోవ‌డంతో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేశాయి ప్ర‌తిప‌క్షాలు.  దీనిపై సుప్రీంకోర్టు సీరియ‌స్ కావ‌డంతో పాటుగా చర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించ‌డంతో పోలీసులు ఆశిశ్ మిశ్రా కు నోటీసులు జారీ చేశారు.  

Read: బంప‌ర్ ఆఫ‌ర్‌: గ్యాస్‌ను ఇలా బుక్‌చేస్తే…బంగారం ఉచితం…

-Advertisement-ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌:  క్రైమ్ బ్రాంచ్ ముందుకు కేంద్ర‌మంత్రి కుమారుడు

Related Articles

Latest Articles