రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారత వైమానిక దళానికి చెందిన తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్ ఫ్రాన్స్‌లోని బహుళజాతి విన్యాసాల్లో పాల్గొంటారు. IAF బృందంలో మహిళా పైలట్ శివాంగి సింగ్ చోటు దక్కింది. ఆమె రాఫెల్ స్క్వాడ్రన్ కు చెందిన మొదటి మహిళా ఫైటర్ పైలట్. ఎయిర్ డామినెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపడం ద్వారా చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది.
Also Read: Chrisann Pereira: జైలు నుంచి విడుదలైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా
శివాంగి సింగ్ 2017లో భారత వైమానిక దళంలో చేరారు. IAFకు చెందిన రెండవ బ్యాచ్ మహిళా ఫైటర్ పైలట్‌లలోకి నియమించబడ్డారు. రాఫెల్‌ను నడపడానికి ముందు శివాంగి మిగ్-21 బైసన్ విమానాన్ని కూడా నడిపారు. 2020లో కఠినమైన ఎంపిక ప్రక్రియను దాటుకుని రాఫెల్ పైలట్‌గా ఎంపికైయ్యారు. తర్వాత రాఫెల్‌ను నడిపిన మొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా నిలిచారు. వారణాసికి చెందినది శివంగి ప్రస్తుతం శిక్షణ పొందుతోంది. త్వరలో హర్యానాలోని అంబాలా నుండి IAFకు చెందిన గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్‌లో భాగం కానుంది.