ఇక‌పై హాస్ట‌ళ్ల‌లో పిల్ల‌ల‌కు తోడుగా తల్లులు

ఈశాన్య‌భార‌త దేశంలోని త్రిపుర రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  హాస్ట‌ళ్ల‌లో ఉండే విద్యార్థినుల కోసం వినూత్న నిర్ణ‌యం తీసుకున్న‌ది.  హాస్ట‌ళ్ల‌లో అమ్మ‌ప్రేమ పేరుతో వినూత్న ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన‌ట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ర‌త‌న్‌లాల్ నాథ్ తెలిపారు.  పిల్ల‌లు.. త‌ల్లుల‌తో ఎక్కువ చ‌నువుగా ఉంటారని,  పిల్ల‌ల‌కు మొద‌టి గురువు తల్లే అని, హాస్ట‌ళ్ల‌లో ఉండే పిల్ల‌లతో త‌ల్లులు రెండు వారాల పాటు ఉండేందుకు అవ‌కాశం క‌ల్పిస్తు మ‌ధ‌ర్ ఆన్ క్యాంప‌స్ పేరుతో ప‌థ‌కాన్ని తీసుకొచ్చిన‌ట్టు ఆయ‌న తెలిపారు.  హాస్ట‌ళ్లలో ఉండి చ‌దువుకునే విద్యార్థులకు ఈ ప‌థ‌కం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, పిల్ల‌ల‌తో త‌ల్లులు ఉండాలి అన్న‌ది ఖ‌చ్చిత‌మైన నిబంధ‌న ఏమీ కాద‌ని,  రెండు వారాలు కాక‌పోయిన మూడు నుంచి నాలుగు రోజుల‌పాటు ఉన్నా ఫ‌ర్వాలేద‌ని త్రిపుర మంత్రి తెలిపారు. 

Read: పాక్ నెత్తిన మ‌రో పిడుగు: కాలుష్య న‌గ‌రాల్లో లాహోర్ ప్ర‌ధ‌మ‌స్థానం…

Related Articles

Latest Articles