భారత్ – పాక్ : గంటలోనే అమ్ముడుపోయిన టికెట్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ఫ్యాన్స్ కి డబుల్ దమాకా మ్యాచ్. బెట్టింగ్ రాయుళ్లకు కోట్లు కురిపించే మ్యాచ్. నువ్వా నేనా అనే ఫైట్ ఈసారి వరల్డ్ కప్‌లో మొదటి మ్యాచే కావడంతో… సూపర్ సండే ఫైట్ కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లో దంచికొట్టిన టీం కోహ్లీ… దయాది తో జరిగే మ్యాచ్ కోసం సయ్యంటోంది. క్రికెట్ లవర్స్ ఈ మ్యాచ్ కోసం ఎదరుచూస్తుంటే… మరోవైపు దాయాది పాకిస్తాన్‌ను వ్యతిరేకించే వర్గాలు మాత్రం.. ఈ మ్యాచ్‌ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో… దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వద్ద అక్కడి ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
దాయాదుల పోరులో గెలుపెవరిది అనేదానికన్నా… మ్యాచ్ సమయం దగ్గరపడే కొద్దీ.. దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల్లో టీంఇండియా పాకిస్తాన్ తో మ్యాచ్‌ని బహిష్కరించాలని వాదనలు మొదలయ్యాయి. ఓ వైపు కశ్మీర్‌లో అరాచకాలు సృష్టిస్తున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు… అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను వ్యతిరేకిస్తున్న పాక్ తో మ్యాచ్ ఆడొద్దని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తోపాటు కేంద్రమంత్రులు రామ్‌నాథ్ అథవాలే, గిరిరాజ్ సింఘ్, బీహార్ డిప్యుటీ సీఎం తార్‌కిషోర్ డిమాండ్ చేస్తున్నారు. మరొకవైనపు దేశంలో పాకిస్తాన్ ని వ్యతిరేకించే హిందూ సంఘాలు కూడా వీరికి గొంతును కలిపాయి.
Also Read
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
సూపర్ సండే ఫైట్ పై రాజకీయ వ్యతిరేకత ఎంతున్నా…. మ్యాచ్ జరిగి తీరుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐసీసీకి ఇచ్చిన మాట ప్రకారం అంతర్జాతీయ టోర్నీలో అర్ధంతరంగా తప్పుకోవడం కుదరదన్నారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆటకు…. రాజకీయ వివాదాలకు… క్రికెట్ మ్యాచ్‌లను బహిష్కరించడం సబబు కాదని బీసీసీఐ వాదన. ఇండియా పాక్‌తోపాటు ప్రపంచ దేశాల్లో దాయాదుల మధ్య మ్యాచ్ జరగాలనే వారి సంఖ్య అధికంగా ఉందంటున్నారు క్రికెట్‌లవర్స్.
అయితే… ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా.. తాను సోషల్ మీడియాకు బలవుతున్నానని వాపోతోంది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. పాకిస్తాన్ కోడలిగా ఇండియా ఐకాన్‌గా తాను ఈసారి ఎవరికీ మద్దతివ్వకుండా… ఈ హై టెన్షన్ మ్యాచ్ రోజున సోషల్ మీడియాకి దూరంగా ఉంటానని వీడియో పోస్ట్ చేసింది.
స్పాట్… సానియా వీడియో
వరల్డ్ కప్ లో ఏ మ్యాచ్ కి లేనటువంటి టికెట్ల డిమాండ్… ఇండో పాక్ మ్యాచ్ కి ఉండటంతో… దుబాయ్‌లో గంటకే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం కెపాసిటి… 25 వేలు. 24న జరిగే మ్యాచ్ కోసం ఈనెల 4న టికెట్లను అందుబాటులోకి తెచ్చింది ఐసీసీ. సైట్‌లో పెట్టిన గంటలోపే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
ఇండియా పాక్ మ్యాచ్ దుబాయ్‌లోనే జరుగుతున్నా…. హైదరాబాద్‌లో జరుగుతోందా అని తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి పబ్స్, మాల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్. క్రికెట్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసేలా ఫుడ్ అండ్ డ్రింక్స్ పై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. బిగ్ స్క్రీన్స్, ప్రొజెక్టర్లను ఏర్పాటు చేస్తున్నాయి. సినిమా హాల్స్ కూడా పెద్దగా రద్దీగా లేకపోవడంతో… మ్యాచ్ ను థియేటర్‌లో చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!