ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం, చిరుజల్లులు పడుతుండగా.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు తప్పేలా లేవని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య బంగాళాఖాతం నుంచి నైరుతి దిశవైపునకు వంపు తిరిగి ఉన్నదని, వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయవ్యదిశగా కదలొచ్చని అంచనా వేస్తోంది హైదరాబాద్…
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన.. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. ఆయా జిల్లాల్లో పరిస్థితి ఏంటి అనేదానిపై ఆరా తీశారు.. ఇక, తన పర్యటనలో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం.. కోవిడ్ రోగులతో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు.. వారిలో భరోసా నింపుతూ ధైర్యాన్ని చెప్పారు..…