ఎండాకాలం మొదలైంది. మార్చి ఆరంభంలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ ఎండల వల్ల శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోతుంది. ఎండల కారణంగా బాడీ డీహైడ్రేషన్ అయ్యి.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే, ఈ సమ్మర్ సీజన్ లో బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే.. వాటర్ కంటెంట్ ఉండే ఆహారం తీసుకోవాలి. కొన్ని రకాల పండ్లు, కూరగాయల్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాంటి కూరగాయల్లో కీరదోసకాయ కూడా ఒకటి.
Also Read:Aaditya Thackeray: ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడింది..
కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కూడా కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు డయాబెటిస్ ను కూడా నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కర నిల్వలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచుతుంది. దోసకాయల్లో 95 శాతం నీరే ఉంటుంది. వేసవిలో కీరదోసకాయ తప్పక తింటారు. ఇది మీ బాడీని చల్లగా ఉంచుతుంది. శరీరాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడానికి, పోషణకు సహాయపడతాయి.
Also Read:Weather Update: తెలంగాణకు చల్లటి కబురు.. ఈనెల 15 నుంచి వానలు పడే ఛాన్స్
కీరదోసకాయలో విటమిన్ సి, కెఫిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. కీరదోసకాయల్లో నీటి శాతం ఉండటం వల్ల బాడీ క్లెన్సర్ గా కూడా పని చేస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. దోసకాయ తొక్క ఫైబర్ తో ఉంటుంది కాబట్టి ఇది మలబద్దకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దోసకాయలను తింటే ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. కీరదోస శరీరంలోని ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపిస్తుంది. హైపర్ గ్రైసీమియా, మంటను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. నీరు పుష్కలంగా ఉండే కీరదోసను కూరగాయగానే కాకుండా చిరుతిండిగానూ తినవచ్చు. కీరదోసలో విటమిన్ కె, విటమిన్ సితో పాటు రాగి, పొటాషియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా శరీరానికి పుష్కలంగా అందుతాయి. కీరదోస తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్ కంట్రోల్‌లోకి వస్తుంది. కీరదోసను రోజూ తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. దీని వల్ల బరువు తగ్గిపోతారు. కీరదోస తింటే శరీరంలో క్యాలరీలు కూడా చేరవు. ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి మెడిసిన్.