నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. అయితే, తాజాగా ఆయన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని వైసీపీ నుండి తొలగించింది. ఈ మేరకు లేఖ విడుదల చేసింది. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి సోదరుడుగా ఉన్న గిరిధర్ రెడ్డి..పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున తొలగిస్తున్నట్టు వైసీపీ అధిష్ఠానం పేర్కొంది. తాజా పరిణామం నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే శ్రీదర్ రెడ్డి మీడియా ముందుకు రానున్నారు. సోదరుడిని పార్టీ నుండి తొలగింపు పై శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.
Aslo Read:Smart Phone: ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. మీ ఫోన్ లైఫ్ పెంచుకోండి
కాగా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల కాలంలో వైసీపీపై తీవ్ర విమర్శులు చేస్తున్నారు. తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారనే ఆరోపిస్తూ వైసీపీకి దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరుపై శ్రీధర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవడంపై డ్రైనేజీలో నిలబడి శ్రీధర్ రెడ్డి నిరసనకు తెలిపారు. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించినా శ్రీధర్ రెడ్డి మెండిచేయి దక్కింది. నెల్లూరు జిల్లా నుండి కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనమైంది. దీంతో ఆయన వైసీసీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. తన తమ్ముడికి వ్యతిరేకంగా పోటీ చేయబోనని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే రాజకీయాలకు గుడ్ బై చెబుతానన్నారు. అయితే, వైసీపీ అధిష్టానం అనూహ్యంగా గిరిధర్ రెడ్డిని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.