తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రెండు మంగళవారాల్లో 11 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు తెలిపారు.
తెలంగాణ మహిళామణులకు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కానుకను ప్రకటించింది. మార్చి 8న 'ఆరోగ్య మహిళ' పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రకటించారు.