గుంటూరు ట్యాక్స్…కార్పొరేటర్ల దందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు ట్యాక్స్…! ప్రస్తుతం ఇదో హాట్ టాపిక్. ‘మొన్నటిదాకా మీరు మింగేశారు.. ఇప్పుడు మా వంతు’ అని.. కొత్త తరహా వసూళ్లకు తెరతీశారట కార్పొరేటర్లు. పాతవి.. కొత్తవి అన్నీకలిపి తాజాగా లెక్కలు సరిచేస్తున్నట్టు సమాచారం. ఆ వాటాలపైనే ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.
అవినీతిలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారా..?
పేరుకు ప్రజాసేవ… చేసేది మరొకటి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్ల తీరుపై వినిపిస్తున్న తాజా కామెంట్. గడచిన దశాబ్దకాలంగా అధికారుల పాలనలో ఉంది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. ఎన్నికలు జరిగాక.. కొత్త పరిపాలన అందిస్తామని ప్రమాణం చేసి మరీ వాటాల వసూళ్లలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారట కొందరు కార్పొరేటర్లు.
Also Read
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కార్పొరేటర్లుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దుకాణం..?
అధికారుల పాలనలో ఉన్నప్పుడు ఏ పనికైనా.. సీక్రెట్‌గా ఆఫీసర్స్ ట్యాక్స్ వసూలు చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో నగరంలో వేసిన రోడ్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. ఆ ప్రాంతంలోని పెద్దల నుంచి లోకల్ కాంట్రిబ్యూషన్ పేరుతోనే 20 నుంచి 30 శాతం కమీషన్ వసూలు చేసేవారట. అడిగేవాళ్లు లేకపోవడంతో ఇలా పదేళ్లపాటు ప్రజలను పిండేశారని చెబుతారు. ఒక్క రోడ్లే కాదు.. అనుమతులు లేని భవనాలను కాపాడటానికి సైతం పెద్ద మొత్తంలో ఆఫీసర్స్ ట్యాక్స్ వసూలు చేసేవారట. ఇవన్నీ కళ్లారా చూసిన కొందరు స్థానిక నేతలు.. మొన్నటి ఎన్నికల్లో కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. అన్ని ఆంశాలను ఆకళింపు చేసుకుని.. కార్పొరేటర్లుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దుకాణం తెరిచేశారట.
‘నా సంగతి ఏంటి?.. నా వాటా ఉంటుందిగా..?’ అని డిమాండ్
నిర్మాణంలో ఉన్న భవనాలు.. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లు.. తమ డివిజన్ పరిధిలో ఉన్న ఇతర కట్టడాలను జల్లెడపట్టి ఓ జాబితా సిద్ధం చేశారట. మీ భవనంలో ఈ లోపం ఉంది.. ఆ గీత దాటారు.. పాలనా అనుమతి లేదు అని బెదరగొట్టి.. అదరగొట్టి వసూళ్ల పర్వం మొదలుపెట్టారట కార్పొరేటర్లు. ఇదేకాదు… కొత్త బిల్డింగ్ కట్టాలన్నా.. షాప్ ఓపెన్ చేయాలన్నా ‘ నా సంగతి ఏంటి?’.. నా వాటా ఉంటుందిగా అని ఓపెన్‌గానే అడిగేస్తున్నారట. కొత్తగా కార్పొరేటర్లు అయిన కొద్దిమందిని పక్కనపెడితే.. ఎమ్మెల్యేల ఆశీసులతో కార్పొరేటర్లు అయినవాళ్లు, రాజకీయంగా ముదిరిపోయిన కార్పొరేటర్లు తగ్గేదే లేదన్నట్టుగా వసూళ్లు చేస్తున్నారట. దీంతో గుంటూరు ట్యాక్స్ పరాకాష్టకు చేరుకున్నట్టు సమాచారం.
ఆర్టీసీ కాలనీ, బ్రాడీపేట, కొత్తపేట ఘటనలపై చర్చ
గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో 2020లో శంకుస్థాపన చేసిన భవనానికి 2021 డిసెంబర్‌లో గుంటూరు ట్యాక్స్ వసూలు చేశారట. బ్రాడీపేటలో షాప్‌ల బోర్డులు పీకించడంతోపాటు.. కొత్తపేటలో కారు గ్యారేజీ యజమానిని బెదిరించడం.. తదితర ఘటనలను ఉదహరణాలుగా చెబుతున్నారు జనం. ఆయా డివిజన్లకు కార్పొరేషన్ అధికారులు వచ్చినా.. టౌన్‌ప్లానింగ్ అధికారులు వచ్చినా.. తమ పర్మిషన్ లేకుండా ఎలా వస్తారని కొందరు కార్పొరేటర్లు నిలదీస్తున్నారట. దీంతో బాధిత అధికారులు తాము ఉద్యోగం చేయాలా వద్దా అని మేయర్ దగ్గర పంచాయితీ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు ఆఫీసర్లు సెలవులు, ట్రైనింగ్ పేరుతో గుంటూరు నుంచి జంప్.
సయోధ్యకు ఇద్దరు పెద్దల విఫలయత్నం..!
సమస్య పెద్దది అవుతుందని అనుకున్నారో ఏమో.. అధికారులకు, కార్పొరేటర్లకు మధ్య గ్యాప్ పెరగకుండా.. సయోధ్య చేసేందుకు ఇద్దరు పెద్దలు అవగాహనా శిబిరం ఏర్పాటు చేశారట. అక్కడా రాజీ కుదరలేదట. పైగా మీటింగ్ ఏర్పాటు చేసిన ఆ ఇద్దరూ.. భవన నిర్మాణదారులు, స్థానిక వ్యాపారులపై చిందులేశారట. ఇదేం పంచాయితీ అని స్థానికులు బెదిరిపోతున్న పరిస్థితి ఉంది. మరి.. గుంటూరు ట్యాక్స్ దినదిన ప్రవర్థమానం అవుతుందో లేక పార్టీ పెద్దలే నాటకీయంగా ముగిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!