గుంటూరు ట్యాక్స్…! ప్రస్తుతం ఇదో హాట్ టాపిక్. ‘మొన్నటిదాకా మీరు మింగేశారు.. ఇప్పుడు మా వంతు’ అని.. కొత్త తరహా వసూళ్లకు తెరతీశారట కార్పొరేటర్లు. పాతవి.. కొత్తవి అన్నీకలిపి తాజాగా లెక్కలు సరిచేస్తున్నట్టు సమాచారం. ఆ వాటాలపైనే ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. అవినీతిలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారా..?పేరుకు ప్రజాసేవ… చేసేది మరొకటి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్ల తీరుపై వినిపిస్తున్న తాజా కామెంట్. గడచిన దశాబ్దకాలంగా అధికారుల పాలనలో ఉంది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. ఎన్నికలు…