బంగారం కొనుగోలు చేయడానికి ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్… పసిడి ధరలు మరోసారి తగ్గాయి… మరోవైపు వెండి కూడా పసిడి దారిలోని కిందకు దిగింది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.530 పతనం కావడంతో రూ.47,300కు దిగిరాగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.490 తగ్గుదలతో రూ.43,350కు క్షీణించింది. ఇక, వెండి ధర ఏకంగా రూ.1500 పతనం కావడంతో.. కిలో వెండి ధర రూ.68,700కు దిగొచ్చింది.
అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి ధరలు పైకే కదిలాయి.. బంగారం ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదల నమోదు చేయడంతో 1732 డాలర్లకు చేరుకుంది.. ఇక, వెండి రేటు కూడా పసిడి దారిలోనే పైకి కదిలింది.. ఔన్స్‌కు 0.79 శాతం పెరుగుదలతో 23.45 డాలర్లకు చేరింది వెండి ధర. శ్రావణ మాసం ప్రారంభం కావడం.. దేశీయంగా పసిడి ధరలు కూడా తగ్గడం మగువలకు శుభవార్తగా చెప్పాలి…