కోడి పందాలకు బరులు సిద్ధం.. మరి పోలీసులేం చేస్తారో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతాయ్. ఇది కొందరికి సంప్రదాయం. మరికొందరికి పండుగ పూట వినోదం.. ఇంకొందరికి దండిగా ఆదాయం సమకూరే మార్గం. ఆనవాయితీ ముసుగులో ఇదే వేదికగా ఇతర జూదాలకు దిగుతున్నారు.ఏటా సంక్రాంతికి కోట్లలో చేతులు మారుతుండడం రివాజుగా మారుతోంది. అడ్డుకుంటామని పోలీసులు అంటుంటే..ఆడించి తీరుతామని నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. సవాళ్లు..ప్రతి సవాళ్ల మధ్య రెండు జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలపై ఉత్కంఠ నెలకొంది.
తెలుగు లోగిళ్లలో పెద్ద పండగ సంక్రాంతి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజులు ఘనంగా జరుపుకునే ఈ పండగ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. సంక్రాంతి రోజుల్లో గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతుంటాయి. పందెంరాయుళ్లు కోళ్లకు కత్తులు కట్టి బరిలో దింపడానికి ఇప్పటికే రెడీ అయిపోయారు.
Also Read
- Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్‌గాంధీ, ఖర్గే
సర్కారు హెచ్చరిస్తున్నా..న్యాయస్థానాలు వద్దని వారిస్తున్నా..పోలీసులు కేసులు పెడుతున్నా..పెడచెవిన పెడుతున్నారు పందెంరాయుళ్లు. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు బరులు సిద్ధం అయ్యాయి. రెండు జిల్లాల్లో సంక్రాంతికి బెట్టింగ్ బంగార్రాజులు కోళ్లతో రెడీ అయిపోయారు. రెండు జిల్లాల పోలీసులు మాత్రం పందెంరాయుళ్లపై కన్నెర్రజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందాలను జరగనివ్వబోమని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు.
ఖాళీ స్థల్లాల్లో కోళ్లను పందాలకు సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. కోనసీమలోని ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, వల్లంకుర్రు మండలాల్లో సంప్రదాయం ముసుగులో కోడి పందాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దాపురం, కాకినాడ రూరల్, పిఠాపురం, కిర్లంపూడి, మల్లిశాల, జగ్గంపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుంటారు. మరోవైపు పండగలకు ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి చుట్టాలు, స్నేహితుల పేరుతో జిల్లాకు వచ్చిన వారు ముందస్తుగా లాడ్జిల్లో రూమ్‌లు బుక్ చేసుకుంటున్నారు.
ఏళ్ల తరబడి నాలుగు రోజుల పాటు కోడిపందాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. బరుల నిర్వాహకులు కొందరు చిన్నా..పెద్దా నాయకులను కలిసి అనుమతికి ఒప్పించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. బరుల నిర్వహణపై చూసీచూడనట్లు వదిలేయాలనే ఒత్తిడి పెరిగింది. రాజకీయాలకు అతీతంగా ఒక్కటై కోడిపందేలకు సై అంటున్నారు. కొందరు స్థానిక అధికారులను మచ్చిక చేసుకుంటున్నారు. మరికొందరిని ఒత్తిళ్లతో బెదరగొడుతూ బరుల జోలికి రాకుండా చక్రం తిప్పుతున్నారు.
పందాల కోసం జిల్లాలకు కోట్లాది రూపాయలు చేరినట్టు తెలుస్తోంది. కోడి పందాలకు ముందు లక్షలాది రూపాయలు ప్రచారం పేరుతో పోలీసులు ఖర్చు చేయడం షరా మామూలుగానే మారుతోంది. పోలీసుల ఆంక్షలు..పందెంరాయుళ్లు పట్టువీడకపోతుండటంతో రెండు జిల్లాల్లోనూ ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
కోడి పందాల స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు జిల్లాల్లోనూ బరులను ఎక్కడికక్కడే ధ్వంసం చేస్తున్నారు. చట్ట వ్యతిరేక పనులను ఉపేక్షించబోమని తేల్చి చెబుతున్నారు ఖాకీలు. పోలీసులు ఎన్ని రకాల ఆంక్షలు విధించినా…తగ్గేదే లే అంటున్నారు పందెం రాయుళ్లు. నిర్వాహకులు కూడా గుట్టు చప్పుడు కాకుండా పందాలకు రెడీ అయిపోతున్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!