సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతాయ్. ఇది కొందరికి సంప్రదాయం. మరికొందరికి పండుగ పూట వినోదం.. ఇంకొందరికి దండిగా ఆదాయం సమకూరే మార్గం. ఆనవాయితీ ముసుగులో ఇదే వేదికగా ఇతర జూదాలకు దిగుతున్నారు.ఏటా సంక్రాంతికి కోట్లలో చేతులు మారుతుండడం రివాజుగా మారుతోంది. అడ్డుకుంటామని పోలీసులు అంటుంటే..ఆడించి తీరుతామని నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. సవాళ్లు..ప్రతి సవాళ్ల మధ్య రెండు జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలపై ఉత్కంఠ నెలకొంది. తెలుగు లోగిళ్లలో పెద్ద పండగ సంక్రాంతి.…