ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి మొదటి రోజు భోగి సందర్భంగా ఊరూరా భోగి మంటలు వేసి పండుగను ప్రారంభించారు. ఇక సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు మొదలయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతుంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తు్న్నారు.. కోడి పందేలకు జోరుగా ఏర్పాట్లు చేశారు.. బరుల వద్ద పందెరాయుళ్ల కోసం అత్యాధునిక సౌకర్యాలను సైతం ఏర్పాటు చేశారు. పందేలు కాసేవాళ్లను కవ్వించి.. వందల కోట్ల రూపాయల జూదానికి తెర తీసేందుకు పందేంరాయుళ్లకు సమయం వచ్చేసింది.. ఇక, ఎన్నికల ఏడాది కావడంతో.. రాజకీయ నాయకుల తోడ్పాటు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలను నిరోధించడానికి జిల్లా కలెక్టర్ మాధవీలత హెచ్చరికలు జారీ చేశారు.. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు జరగడానికి వీలులేదని స్పష్టం చేసిన ఆమె.. ఒకవేళ పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు.
సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు కోడి పందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి. అయితే కోడి పందాలు సంప్రదాయ బద్ధంగానే నిర్వహించాలని కోర్టులు తెలుపుతున్నా.. కోర్డుల ఆదేశాలను భేఖాతరు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. భీమవరం, ఉంది, వెంప, దెందులూరు, తణుకు, అమలాపురం, రావులపాలెంలో భారీగా తమ కోళ్లను బరిలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముమ్మిడివరం, రామచంద్రాపురం, కాకినాడ, రాజానగరం, ఐ.పోలవరం,…
సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతాయ్. ఇది కొందరికి సంప్రదాయం. మరికొందరికి పండుగ పూట వినోదం.. ఇంకొందరికి దండిగా ఆదాయం సమకూరే మార్గం. ఆనవాయితీ ముసుగులో ఇదే వేదికగా ఇతర జూదాలకు దిగుతున్నారు.ఏటా సంక్రాంతికి కోట్లలో చేతులు మారుతుండడం రివాజుగా మారుతోంది. అడ్డుకుంటామని పోలీసులు అంటుంటే..ఆడించి తీరుతామని నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. సవాళ్లు..ప్రతి సవాళ్ల మధ్య రెండు జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలపై ఉత్కంఠ నెలకొంది. తెలుగు లోగిళ్లలో పెద్ద పండగ సంక్రాంతి.…
సంక్రాంతి పండుగంటేనే కోళ్ల పందేలకు ఫేమస్.. ఎంతో హుషారుగా కాయ్‌రాజాకాయ్ అంటూ యువతతో పాటు స్థానిక ప్రముఖులు కూడా ఈ పందేలలో పాల్గొంటుంటారు. అయితే ఈ కోడి పందేలను గతంలో సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధించింది. ఆ తరువాత 2018 జనవరిలో కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకుండా, జూదం లేకుండా, ఈ పద్ధతిని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. అయితే కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ కోడి పందేలకు ఎక్కువగా ఆతిథ్యమిస్తుంటాయి.…
అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తుంది. ఆ ఊళ్లో మాత్రం ఇప్పుడే వచ్చింది. కొబ్బరి తోటల్లో బరులు కట్టించి.. జోరుగా పందాలు మొదలెట్టారు. ఊరి ప్రెసిడెంట్‌గారు దగ్గరుండి మరీ బెట్టింగులు పెట్టించారు. తోటల్లో మేళం సంగతిని లేటుగా తెలుసుకున్న పోలీసులు, రైడింగులు కూడా చేశారు. అసలు విషయం ఏంటంటే.. బరుల దగ్గర అరెస్టైన వాళ్లు.. స్టేషన్‌కు వచ్చే సరికి గాయబ్ అయ్యారు. ఎందుకిలా? అని ఆరాతీస్తే తెలిసింది. ప్రెసిడెంట్‌గారు అధికారపార్టీ ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్ అని. ఇంతకీ ఆ…