ఇటీవల వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్లో విజృంభిస్తోంది. రోజురోజుకు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా యూకే, యూఎస్ దేశాలలో ఇప్పటికే ఒమిక్రాన్ బారినపడిన కొందరు మృత్యువాత పడుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం న్యూఇయర్ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా యువతి న్యూఇయర్ వేడుకల్లో చేసి సంబరాలు అంతా ఇంతా కాదు. కొందరు ఉన్న ఊర్లోనే సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే, మరి కొందరు పబ్లు, రిసార్ట్ల్లో జరుపుకుంటున్నారు.
అయితే మరి కొందరు వెకేషన్ స్పాట్అయిన గోవాకు వెళ్లి జరుపుకుంటుంటారు. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గోవా ప్రభుత్వం న్యూయర్ వేడుకలపై పర్యాటకులపై ఆంక్షలు విధించింది. గోవాలోకి రావాలంటే పర్యాటకులు కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని, అంతేకాకుండా 2 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఉండాల్సి సూచించింది. క్యాసినో, థియేటర్లు, ఆడిటోరియమ్స్, రివర్ క్రూయిజ్, వాటర్ పార్క్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్ 50 శాతం సామర్థ్యంతో పనిచేయాలని గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.