హుజురాబాద్ ఈటల రాజేందర్ కంచుకోట అనడంలో సందేహం లేదనిపిస్తోంది. ఎందుకంటే.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసీఆర్. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా దళిత బంధు, మహిళలకు మహిళా సంఘాల భవనాలకు భారీ నిధుల మంజూరు లాంటి సంక్షేమ పథకాలను హుజురాబాద్ ఓటర్ల ముందు…
హుజురాబాద్ గడ్డమీద తన అధిక్యతను ఈటల రాజేందర్ చాటుతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకంజలో ఉన్నా… ఈవీఏంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల లీడ్‌లో ఉన్నారు. తొలి రౌండ్‌లో 166, రెండవ రౌండ్‌లో 192, మూడవ రౌండ్‌లో 911 ఓట్ల ఆధిక్యతను సాధించారు. మూడవ రౌండ్ ముగిసిన సరికి బీజేపీ మొత్తం 13,525 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 12,252 ఓట్లు, కాంగ్రెస్‌కు 466 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం నాల్గవ…
గత 5 నెలల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఉప ఎన్నికల నోటిషికేషన్ వచ్చిననాటి నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి ప్రజలను ఎంతవరకు ఒప్పించారనేది ఈ రోజుతో తేలనుంది. ఓటర్లు మెచ్చిన లీడర్ ఎవరో నేటి ఓట్ల లెక్కింపుతో బయట పడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఈవీఏంలను కూడా ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలోనే ఏర్పాటు చేసిన…
రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతతో ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. కోవిడ్ పేషెంట్ల, లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ సమయం ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. అయితే చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే పోలింగ్ ముగిసింది. అంతేకాకుండా ఈవీయంలకు ఎన్నికల సిబ్బంది సీల్ వేస్తున్నారు. అక్కడక్కడా చిన్నచిన్న…
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకే మొదలైంది. ఉదయం పలు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని హిమ్మత్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భార్య శ్వేత మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నాన్ లోక్సల్స్ ఎందుకు నియోజకవర్గంలో ఉన్నారంటూ, ఓటర్లను ప్రలోభ పెడుతోందంటూ తుల ఉమను గెల్లు శ్వేత…
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఎన్ని కథలు పడ్డా కూడా కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసి, ఈయనను పార్టీ నుండి కేసీఆర్ బయటకు వెళ్లగొట్టేది భవిష్యత్తులో తప్పని పరిణామమని పేర్కొన్నారు విజయశాంతి. ఢిల్లీ లో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా బూతులు తిట్టి, చెయ్యి చేసుకుని కొట్టి అవమానించిన హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. అందుకు మొదట హరీష్ రావు…
హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం వీణవంక మండలంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. హుజురాబాద్‌లో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. తనకు మద్దతు ఇచ్చినా, బీజేపీకి ఓటు వేసినా…
ఈటెలను రేవంత్‌రెడ్డి రహస్యంగా కలిశారన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు అధికార పార్టీ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షాలు డిఫెన్స్‌లో పడ్డాయి. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు ఆ రెండు పార్టీల నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈటెల, తాను కలిసిన మాట నిజమేనన్నారు. అయితే తాము చీకట్లో కలవలేదని వివరణ ఇచ్చారు. ఈ ఏడాది మే 7న…
కరీంనగర్ జిల్లా : జమ్మికుంటలో కవాతు చేయాలని మహిళలు కోరుతున్నారని… తప్పకుండా త్వరలోనే చేస్తామని పేర్కొన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. జమ్మికుంట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తనకు సపోర్ట్ గా ఉన్న నాయకులను పట్టండని కెసిఆర్ ప్రగతి భవన్ లో ప్లాన్ వేస్తే.. హరీశ్ రావు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈరోజు ఉన్న నాయకులు రేపు తనతో ఉండడం లేదని…
హుజురాబాద్ ఎన్నికల్లో ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే బండి సంజయ్ కు ప్రమాదం, ఆ తర్వాత కిషన్ రెడ్డికే ప్రమాదమని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల వైఖరిని హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎండగడతామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. కేంద్రంతో పోరాటం అనేది సుద్ద తప్పు అని… యూపీ ఎలక్షన్ల కోసమే మోదీ, అమిత్ షా కేసీఆర్ ను దగ్గరకు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్ర…