Bhajan Lal Sharma: రాజకీయ హేమాహేమీలు, దిగ్గజాలు ఉన్నా కూడా వారందరిని పక్కన పెట్టి అనూహ్యమైన వ్యక్తిని రాజస్థాన్ సీఎంగా ప్రకటించింది బీజేపీ. మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్ వంటి వ్యక్తులను పక్కనపెడుతూ.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్ శర్మకు రాజస్థాన్ అధికార పగ్గాలు అప్పగించింది. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాగే విష్ణుదేవ్ సాయ్, మోహన్ యాదవ్‌లను సీఎంలుగా ప్రకటించిన సర్‌ప్రైజ్ చేసిన బీజేపీ, రాజస్థాన్ సీఎం అభ్యర్థి…
రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ రోజు జరిగిన శాసనసభపక్ష నేత ఎన్నుకునే సమావేశంలో సీఎం అభ్యర్థిగా భజన్ లాల్ శర్మని ఎన్నుకున్నారు.
Rajasthan CM: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థుల ఎన్నికలో బీజేపీ అందరిని ఆశ్యర్యానికి చేసింది. ఇప్పటికే ఛత్తీస్గడ్‌కి విష్ణదేవ్ సాయ్, ఎంపీకి మోహన్ యాదవ్‌లను సీఎంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రానికి సీఎంగా కొత్తవారిని ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని సమాచారం. ఇక్కడ కూడా బీజేపీ బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శాసనపక్ష నేతను బీజేపీ ఎమ్మె్ల్యేలు ఎన్నుకోబోతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన…
BJP CM: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించి, కొత్త నాయకుడిని ఎన్నుకోవడం కోసం బిజెపి నాయకత్వం మూడు రాష్ట్రాల నుండి విస్తృతమైన అభిప్రాయాన్ని సేకరిస్తోంది.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించేసింది బీజేపీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 199 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 115 సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో బీజేపీ తరుపున ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజేనే ముఖ్యమంత్రిగా చేస్తారా..? లేకపోతే కొత్తవారిని సీఎం సీటు వరిస్తుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ‘మూర్ఖుల ప్రభువు’ ప్రకటనపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఇలాంటి విమర్శలు ప్రధానిగా గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడితే మంచిది కాదు.. ఎంత తక్కువ విమర్శలు చేస్తే అంత మంచిది అని ఆయన చెప్పుకొచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్‌లో జరిగిన తరహాలో రాష్ట్రంలో కూడా కులాల సర్వే నిర్వహిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
గతేడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నది తాను కాదని గుజరాత్ ప్రజలేనని సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ తీవ్ర ప్రచారం తర్వాత, ప్రధాని మోడీ ప్రసంగం ఎన్నికల వాతావరణాన్ని మార్చింది. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా అదే నినాదం ఇచ్చారు.
రాష్ట్రంలో ఎన్నికలకు ముందు జరిగే చివరి సెషన్‌లో రాజస్థాన్ అసెంబ్లీ ఈ రోజు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల పని హామీనిచ్చే మైలురాయి బిల్లును ఆమోదించింది. వృద్ధులు, ప్రత్యేక వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు కనీసం రూ.1,000 పెన్షన్‌కు కూడా ఈ బిల్లు హామీ ఇస్తుంది.