ప్రశాంతమైన కర్నూలు జిల్లాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా ఆత్మకూర్ సంఘటన అనంతరం హుటాహుటిన సంబంధిత ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, మతవిద్వేషాలు రెచ్చగొట్టే…
ఇటీవల వంగవీటి రాధా తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు ప్రభుత్వం భద్రత కల్పించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాసారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరుపాలని చంద్రబాబు కోరారు. దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత…
ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. గత మూడు రోజులుగా టీడీపీ నేతలు, వైసీపీ నేతలు మాటలతో యుద్ధ చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు కౌంటర్ ఇచ్చారు. పదవి దిగాక గౌతమ్ సవాంగ్ పరిస్థితేంటో ఆలోచించుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సీఎం జగన్ ఏదో అంటే బీపీ వచ్చి పార్టీ కార్యాలయంపై దాడి చేశారంట.. గతంలో చంద్రబాబును దుర్భాషలాడితే మాకూ బీపీ రాలేదనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ‘తాడేపల్లి కొంపను కూల్చాలని…
ఏపీలో నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ మాట్లాడుతూ.. పట్టాభిరామ్ మాట్లాడింది దారుణమైన భాష అన్నారు. అంతేకాకుండా పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేసిన తరువాత నుంచే ఆందోళనలు ప్రారంభమయ్యాయన్నారు. చట్టబద్దమైన పదవుల్లో ఉన్న వారిని తిట్టకూడదన్నారు. పట్టాభిరామ్ నోరు జారి మాట్లాడిన మాటలు కాదని, ఒక పార్టీ ఆఫీసు నుంచి మాట్లాడించారన్నారు. ఒక ముఖ్యమంత్రిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. దీనితో పాటు నిన్న 5.03 నిమిషాలకు తెలియని…