ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. 2017 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 325 సీట్లు గెలుచుకున్నది. అయితే, ఈసారి ఆ పార్టీకి కొంత ఎదురుగాలి విస్తుండడంతో, దానిని తనవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రతిజ్ఞ యాత్ర పేరుతో యాత్ర చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయాత్తం అవుతున్నది.…