పీఆర్సీపై ఏపీలో క్లారిటీ రావడంలేదు. దీంతో ఎప్పటినుంచో ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌తో భేటీ కావాలని ఆశించడంతో వారితో జగన్ ఈ రోజు భేటీ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ నిర్వహించిన భేటీ ముగిసింది. సమావేశంలో సీఎం జగన్ ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని వెల్లడించారు. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని, ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నానన్నారు.
దయచేసి అందరూ ఆలోచన చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నానన్నారు. ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని, మంచి చేయాలన్న తపనతో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. 2–3 రోజుల్లో దీని పై ప్రకటన ప్రకటన చేస్తామని, నేను మీ అందరి కుటుంబ సభ్యుడ్నిని ఆయన వెల్లడించారు. మీకు మనసా, వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నానని ఆయన పేర్కొన్నారు.