దీపావళి వస్తుంది అంటే పిల్లలు ఎంత సంతోషిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటుంటారు. టపాసులు కాల్చే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రమాదాలు తప్పవు. గుజరాత్‌లోని సూరత్‌లో నలుగురు చిన్నారులు చేసిన పని పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. అయితే, అప్రమత్తం కావడంతో తృటిలో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. సూరత్‌లోని ఓ ఇంటి ముందు నలుగురు పిల్లలు టపాసులు తీసుకొని వచ్చి వాటిని మ్యాన్‌హోల్‌పై ఉంచారు. టపాసుల్లోని భాస్వరాన్ని కాగితంపై పోసి వెలిగించేందుకు అగ్లిపుల్ల గీయగా మ్యాన్‌హోల్ లోపలి నుంచి మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన చిన్నారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిశీలించగా, మ్యాన్‌హోల్ కింద గ్యాస్‌పైప్‌లైన్ ఉందని, అందుకే మంటలు పైకి వచ్చాయని తేల్చిచెప్పారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
सोसायटी में खेल रहे बच्चों ने फटाके फोड़ने के लिए गटर के ऊपर जगह पसंद की।एक बच्चे ने जैसी ही माचिस जलाई गटर में गैस की मात्रा ने तुरंत आग पकड़ ली।सभी बच्चे बाल बाल बचे।#ViralVideo #SEVARFIRE #SURAT #GujaratGas #BreakingNews pic.twitter.com/Jgu0AdG19M
— Ajay Tomar | अजय तोमर (@ajay_tomar1) October 29, 2021