Deputy CM Pawan Kalyan: కోనసీమ తిరుమలగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా నూతన రహదారి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. రూ.6 కోట్లు పంచాయతీరాజ్ నిధులు మంజూరు చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే వాడపల్లి క్షేత్రానికి రాకపోకలు సాగించే భక్తుల ప్రయాణ కష్టాలు తీరతాయి. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కొత్తపేట…
Kaleshwaram : ప్రస్తుతం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) ఇచ్చిన రిపోర్టు ప్రకారం, ఈ మధ్య కాలంలో రెండు ప్రధాన బ్యారేజీల సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. డీపీఆర్‌లో పేర్కొన్న ప్రాంతాల్లో కాకుండా, కొత్త ప్రాంతాల్లో ఈ బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఈ నిర్ణయం తీసుకున్న వారెవరో స్పష్టత లేని ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం విషయంపై ఎన్‌డీఎస్ఏ రిపోర్టులో పేర్కొన్నదిగా, ఈ బ్యారేజీలు డీపీఆర్‌లో సూచించిన ప్రాంతాల్లో…
China: చైనాలోని శాంఘైకు పశ్చిమంగా ఉన్న జిన్‌కి పట్టణంలో ఒక వృద్ధుడు హువాంగ్ పింగ్ తన రెండు అంతస్తుల ఇంట్లో జీవిస్తున్నాడు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదిత పరిహారం తీసుకోకుండా ఒక రహదారి మధ్యలో తన సొంత ఇంటిలో జీవిస్తున్నాడు. నిజానికి ఆ వృద్ధుడు తనతో పాటు ఉంటున్న 11 నెలల మనవడు నివసిస్తున్న ఇంటి దగ్గర నేషనల్ హైవే నిర్మిస్తున్న కారణంగా దానిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు పరిహారంగా పువాంగుకు ఏకంగా 1.6 మిలియన్ CNY…
Building Collapse : కార్గిల్ జిల్లాలో శనివారం కొండ వాలుపై మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో దాదాపు 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను 23 జూలై 2024న సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్ లో ప్రభుత్వ దృష్టి మధ్యతరగతి, పేదలపైనే ఉండొచ్చు.
మెట్రో రెడ్ లైన్ విస్తరణకు మార్గం సుగమమైంది. రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డీడీఏ (DDA) పంపింది. ఈ మేరకు శనివారం రాజ్‌నివాస్ వెల్లడించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మెట్రో కారిడార్ నిర్మాణ అంశాన్ని కేంద్రంతో వివిధ సందర్భాల్లో ప్రస్తావించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన ఏపీ విభజన చట్టం-2014 నియమనిబంధనలకు అనుగుణంగా పూర్తయినట్టు రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇరు రాష్ట్రాలకు పంపిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రెండు రాష్ట్రాల నడుమ ఆస్తుల పంపకంలో భాగంగా ఆప్షన్-జీ కి ఇరు రాష్టాలు అంగీకారం తెలపడంతో విభజన పూర్తయినట్టు కేంద్రం ఈ లేఖలో తెలిపింది.
వైద్యాశాఖ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహా సమీక్ష చేపట్టారు. సచివాలయంలోని తన కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వరంగల్లో 2100 బెడ్స్ సామర్థ్యంతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్లోని అల్వాల్లో నిర్మిస్తున్న 1200 బెడ్స్ సామర్ధ్యం కలిగిన టిమ్స్ (TIMS) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎల్బీనగర్లో నిర్మిస్తున్న 1000 బెడ్స్ సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్ నగర్లో నిర్మిస్తున్న 1000 బెడ్స్ సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ల…