ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో ప్రస్తుతం మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు గిల్(9),, వెంకటేష్ అయ్యర్(18) తో పాటుగా కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ (8) కూడా త్వరగా పెవిలియన్ చేరుకోవడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ కొంచెం గాడి తప్పింది. కానీ ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి(45) తో రాణించగా చివర్లో నితీష్ రాణ(37), దినేష్ కార్తీక్ (27) మంచిగా పరుగులు చేయడంతో కోల్‌కతా నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ ను ముగించింది. ఇక చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టగా రవీంద్ర జడేజా ఒక్క వికెట్ తీసాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే ధోనిసేన 172 పరుగులు చేయాలి. ఒకవేళ చెన్నై గెలిస్తే మళ్ళీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.