రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది కరోనా మహమ్మారి. కరోనా వైరస్ కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. డెల్టా వేరియంట్ రూపంలో సెకండ్ వేవ్ సృష్టించిన కరోనా రక్కసి ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్‌కు బాటలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గత నెల మొదటి వారం వరకు దేశవ్యాప్తంగా సుమారు 9 వేల లోపు కరోనా కేసులు నమోదుకాగ, తాజాగా ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 90వేల పై చిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. కోవిడ్ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని లేఖలో కేంద్రం ఆదేశించింది. అంతేకాకుండా జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, ఆస్పత్రుల్లో సిబ్బంది మౌలిక వసతులు, పడకల లభ్యత చూసకోవాలని కేంద్రం సూచించింది.